KMM: నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన పొడుగు సైదులు (40) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
గుండెపోటుతో వ్యక్తి మృతి


