హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు!

WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రాలోని అంబేద్కర్ నగర్‌లో వీధికుక్కల బెడద తీవ్రంగా పెరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇంటి వద్ద నిద్రిస్తున్న భూత్కూర్ చెన్నమ్మపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కాలనీలో 3 మాంస విక్రయ కేంద్రాలు ఉండటంతో కుక్కలు సంఖ్య పెరుగుతోంది. ప్రజల ప్రాణాలు పోయాక స్పందిస్తారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.