హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్టీపర్పస్ స్టాల్‌లో అదనపు చార్జీలు

VKB: వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. ప్రశ్నించిన ప్రయాణికులతో సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.