హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్కొండలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు

NZB: బాల్కొండ మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో స్టీల్ బ్యాంక్‌ను ఆదివారం ప్రారంభించారు. 3,000 స్టీల్ ప్లేట్లు, 1,000 గ్లాసులతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ రాజేశ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమమైనా గ్రామపంచాయతీ స్టీల్ బ్యాంక్ నుంచి సేవలు అందించబడతాయన్నారు.