హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాలివాన వస్తే గండమే

JN: జనగామ–హుస్నాబాద్ ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా ఏళ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం భారీ వృక్షాలుగా ఎదిగాయి. అయితే కొన్ని చెట్లు ఎండిపోయి మోడులుగా మారాయి. ఈదురుగాలులు వీచే సమయంలో మోడువారిన చెట్లు విరిగిపడి ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన ఆ వృక్షాన్ని అధికారులు వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.