JGL: మెట్‌పల్లి పాత బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ చెరువును తలపించింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్లోకి వరద నీరు పోటెత్తడంతో వ్యాపారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూరగాయలన్నీ నీట మునగడంతో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి అని, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
చెరువును తలపిస్తున్న కూరగాయల మార్కెట్


