హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రసాదాల కొనుగోలుకు డిజిటల్ సౌకర్యం కల్పించాలి'

NLG: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు ప్రసిద్ధ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతటా డిజిటల్ యుగం నడుస్తున్నా, ప్రసాద విక్రయశాలలో మాత్రం కేవలం నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం లేకపోవడంతో ప్రసాదం కొనుగోలు చేయలేక భక్తులు వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.