హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో తాగునీటి అంతరాయం

HYD: మంజీరా ఫేజ్–2లో బీరంగూడ కమాన్ వద్ద మెయిన్ పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడింది. జలమండలి అత్యవసర మరమ్మతులు చేపట్టి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మరమ్మతుల అనంతరం దశలవారీగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారు. లీకేజీ ప్రభావంతో ఆర్సీపురం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.