హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు

SDPT: దుబ్బాక కార్తిక ఫౌండేషన్ గణేష్ మండపంలో వినాయక నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సామూహిక లలితా సహస్రనామ పారాయణంలో 250 మందికి పైగా మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం స్వామివారికి విశేష మహా హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.