హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై వర్షపు నీరు.. వాహనదారుల తిప్పలు..!

VKB: వికారాబాద్ పట్టణంలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఎన్నెపల్లి ప్రధాన రోడ్డు, బీజేఆర్ చౌరస్తా, బ్రిడ్జి వద్ద భారీ గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు కనిపించక అదుపుతప్పి పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.