KMM: కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సులో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి పలాస వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు నిలిపాడు. ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని 45 మంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
బస్సులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం


