హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

GDWL: అలంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారని, అలంపూర్, అయిజ, మానవపాడు మండలాల లబ్ధిదారులు హాజరుకావాలని కోరారు.