హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాపులను సంపూర్ణంగా నిషేధిస్తూ గ్రామస్తుల తీర్మానం

PDPL: బెల్టుషాపులపై మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామపంచాయతీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామస్తుల వినతి మేరకు ఆదివారం అత్యవసర పంచాయతీ భేటీలో బెల్టుషాపులను సంపూర్ణంగా నిషేధిస్తూ తీర్మానం ఆమోదించింది. ఎవరైనా చాటుగా విక్రయిస్తే రూ.20వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వారికి రూ.2వేల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది.