హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ప్రశాంతంగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు

ADB: జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎస్పీ ఊరేగింపు మార్గాన్ని పరిశీలించి, భారీ విగ్రహాల వాహనాల ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు.