హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉడా పార్క్‌లో అస్తవ్యస్తంగా వ్యర్థాలు

విజయనగరంలోని అలకానంద కాలనీ ఉడా పార్క్‌లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా నిన్న మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. అయితే ఆహార వ్యర్థాలను అక్కడే వదిలేయడంతో తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. సోమవారం ఉదయం పార్కుకు వచ్చిన వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గంధం భరించలేక వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోయారు.