హైదరాబాద్: 28°C
తెలంగాణ

లింబుగూడలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య వ్యవస్థ

ASF: వాంకిడి మండలం ఖరిడి గ్రామపంచాయతీలోని లింబుగూడలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురికికాలువలు చెత్తతో నిండిపోయి మురుగునీరు ఇళ్ల మధ్య నిలిచిపోతోంది. దీంతో దోమలు పెరిగి, దుర్గంధం వెదజల్లుతోందని గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అధికారులు గ్రామ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరుతున్నారు.