హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిగీతాలకు ఉత్సాహంగా మహిళల నృత్యాలు

MNCL: మంచిర్యాల పట్టణం రాంనగర్‌లో పార్వతీపుత్ర గణేష్ మండలి ప్రాంగణం మహిళల నృత్యాలతో సందడిగా మారింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా మహిళలు భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో మండలి ప్రాంగణం కేరింతలు, చప్పట్లతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ మహిళలు ఉత్సాహంగా గడిపారు.