హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవీపేట్‌లో ప్రజా కళల జాతర కరపత్రాల ఆవిష్కరణ

NZB: నవీపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అరుణోదయ ఆధ్వర్యంలో ప్రజా కళల జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో విమలక్క 50 ఏళ్ల పాటల ప్రస్థానంపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.