హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

అన్నమయ్య: కలికిరి మండలంలోని మరికుంటపల్లి వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గోగుల తిమ్మయ్య (70) మృతి చెందారు. పారపట్ల కురవపల్లి గ్రామానికి చెందిన తిమ్మయ్య మేడికుర్తి క్రాస్‌ నుంచి మరికుంటపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.