హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేట భక్త ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజల అనంతరం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. భక్తులు తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ప్రార్థించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.