హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు రిజర్వాయర్‌లో 1.565 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 389.22 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్‌ ప్రాంతం నుంచి 56 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఔట్‌ఫ్లో లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కులు వినియోగమవుతున్నాయి.