హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరాలపై గుమ్మడిదల పోలీసుల దాడులు

SRD: బొంతపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఓ మూసివేసిన భవనంలో పేకాట ఆడుతున్న 16 మందిని గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి 12.20 గంటలకు SI సిబ్బందితో కలిసి దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 40,650 నగదు, 16 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు, మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో కారును స్వాధీనం చేసుకున్నారు.