హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: జిల్లాలో 26 ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 24, పట్టణాల్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 24లోగా దరఖాస్తులను సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేదా సచివాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు ananthapuramu.ap.gov.in సందర్శించాలని కోరారు.