హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

KRNL: కర్నూలు నగరంలోని SBI కాలనీలో ఉన్న నగరపాలక సమావేశ భవనంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. నగర ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పిస్తే పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు.