JN: లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి గొరిగె శ్రీశైలం (51) మృతి చెందారు. కాలికి గాయం కావడంతో ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బాత్రూమ్‌కు వెళ్తూ జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి


