హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెల్లత్రాచును పట్టుకున్న స్నేక్ క్యాచర్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలో తెల్లత్రాచు ఇళ్ల మధ్యలో సంచరిస్తుంది. గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్ శీలం స్వామికి సమాచారం అందించడంతో పామును చకచక్యంగా పట్టుకొని అనంతరం సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. పాముకు హాని తలపెట్టకుండా అడవిలో వదిలిపెట్టిన స్వామిని గ్రామస్తులు అభినందించారు.