హైదరాబాద్: 28°C
తెలంగాణ

OBC సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం

WGL: జిల్లా కాంగ్రెస్ OBC సెల్ జిల్లా అధ్యక్ష పదవికి ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు WGL జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. TPCC OBC సెల్ రాష్ట్ర నాయకులు జిల్లా పల్లి ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరై దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.