హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు మండలాలలో పర్యటించనున్న ఎమ్మెల్యే

ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ సోమవారం పలు మండలాలలో పర్యటించనున్నారు. ఉ.11కు ఉట్నూరు మండలం హస్నాపూర్‌లో నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. ఉ.11: 45కు మండలంలోని ఘనపూర్‌లో మల్టీపర్పస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. మ.1గం.కు ఖానాపూర్ లోని ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్‌ను ప్రారంభిస్తారు. సా.4 గం.నుండి జన్నారం మండలంలో పలువురుని పరామర్శిస్తారు.