MHBD: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాలతి (51) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. మహబూబాబాద్ పట్టణంలోని నందినగర్‌కు చెందిన మాలతి భవానీనగర్ తండా ఎంపీపీఎస్‌లో పనిచేస్తున్నారు. గత నెల 13న పాఠశాలకు వెళ్తుండగా గ్యాస్ కార్యాలయం సమీపంలో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి


