హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ పోస్టులు పెంచాలంటూ లోకేష్‌కు వినతి

కాకినాడ అచ్యుతాపురంలో ఆదివారం ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రి నారా లోకేష్‌కు పోలీస్ అభ్యర్థులు కలిశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో SI, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని దీనిపై పరిశీలన చేస్తామని లోకేష్‌ తెలిపారు.