హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికపై దాడి.. యువకుడిపై పోక్సో కేసు

WNP: బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో బిజినేపల్లి మండలానికి చెందిన యువకుడిపై గ్రామీణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికకు పరిచయమైన యువకుడు ఆమెను లోబరుచుకున్నట్లు, బాలిక గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.