WG: పెంటపాడు మండల పరిషత్ సమావేశం ఈ నెల 22న మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో ఎం. వెంకటేశు తెలిపారు. ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ఎంపీటీసీలకు ఇది చివరి సమావేశం కావడంతో వివిధ శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు. సమావేశం అనంతరం ఎంపీటీసీలను సన్మానించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెంటపాడులో మండల పరిషత్ సమావేశం


