హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఉద్యోగుల సమస్యల పరిష్కారమే NGOS లక్ష్యం’

NTR: విజయవాడ గాంధీనగర్‌లో AP NGOS రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు విద్యానిసాగర్ అధ్యక్షతన జరిగింది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, రెండు డీఏల చెల్లింపుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేస్తామని పేర్కొంటూ, డిసెంబర్ 12న ఢిల్లీలో జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.