హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలి: మెట్టు శ్రీధర్

జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) సంగారెడ్డి ఎక్స్ రోడ్స్-మదీనగూడ విస్తరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1,297.75 కోట్ల అంచనాతో ప్రారంభించిన 29.35 కి.మీల విస్తరణలో 32 శాతమే కావడంపై మండిపడ్డారు. అధికారులు పనుల నాణ్యతను పరిశీలిస్తూ.. ప్రయాణికుల కష్టాలను తీర్చేలా పనులను పూర్తి చేయాలన్నారు.