హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై గుంతలను పూడ్చిన యువకులు..!

WGL: నర్సంపేట పురపాలిక పరిధి మహేశ్వరంలో గతంలో కురిసిన వర్షాలకు ప్రధాన రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గుంతలను గమనించిన మహేశ్వర యూత్ సభ్యులు మట్టి పోసి పూడ్చారు. రహదారి సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతో వారే శ్రమదానం చేసినట్లు తెలిపారు.