హైదరాబాద్: 28°C
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో కొనసాగిన భారత జోరు

చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఓపెన్ కేటగిరీలో భారత్ 3-1తో హాలండ్‌పై గెలిచి ఐదో విజయం అందుకుంది. అనీశ్ గిరిపై ప్రజ్ఞానంద, ఎర్విన్‌పై గుకేష్ గెలుపొందారు. జోర్డెన్ వాన్ ఫారీస్ట్‌తో మ్యాచ్‌ను అర్జున్, వాన్ విలీతో మ్యాచ్‌ను నిహాల్ డ్రా చేసుకున్నారు. మహిళల విభాగంలో మాత్రం హంపి, దివ్య, వంతిక మ్యాచ్‌లు డ్రా కాగా, వైశాలి ఓటమి పాలైంది.