హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధి

భద్రాద్రి కొత్తగూడెంలో ఏఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా పాల్గొని, నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.