హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములకలపల్లిలో రేపు మంత్రి తుమ్మల పర్యటన

BDK: ములకలపల్లి మండలంలో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి చాపరాలపల్లి వద్ద పాములేరుపై రూ.463 లక్షలతో నిర్మించిన హై లెవెల్ వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో పురోగతిపై సమీక్షించనున్నారు.