హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

WNP: పట్టణంలోని మర్రికుంటకు చెందిన మారోజు భాస్కర్(58) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 19న గడ్డి మందు తాగిన భాస్కర్‌ను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 20న మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుమారుడు శివమణి ఫిర్యాదు మేరకు ఎస్సై రిషికేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.