JGL: కొడిమ్యాలమండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడలు కొనసాగాయి. అండర్-14, అండర్-17 బాలబాలికలకు వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సోమవారం కోకో, కబడ్డీ పోటీలు నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటలకు బహుమతులు అందజేయనున్నట్లు ఎంఈఓ ఐత శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
కొనసాగుతున్న ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడలు


