హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపముఖ్యమంత్రికి డీసీసీ అధ్య‌క్షుడి కృతజ్ఞతలు

సంగారెడ్డి డీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకంపై స్పందిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.