హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డి ఆర్టీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

సంగారెడ్డి ఆర్టీసీ రీజియన్‌ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 21న ప్రారంభమవుతుందని ఆ సంస్థ ఆర్‌ఎం విజయభాస్కర్ తెలిపారు. పోటీదారులు 21న సమ్మతి పత్రాలు సమర్పించాలని, 22న ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడిస్తామని చెప్పారు. జాబితాపై అభ్యంతరాలను 24 వరకు స్వీకరించి, 25న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.