హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీన్మార్ మల్లన్నకు జాతీయ బీసీ సేన సంఘీభావం

RR: తీన్మార్ మల్లన్న పాదయాత్ర షాద్‌నగర్ చేరుకోగా జాతీయ బీసీ సేన ఘనంగా స్వాగతం పలికింది. మల్లన్నను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఉద్యమకారుల విగ్రహాలకు పూలమాలలు వేసి యాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీసీ సేన నాయకులు ప్యాట జయ శ్రీకాంత్, పోలేపల్లి శ్రీనివాస్ గౌడ్, కే.సరస్వతి, పద్మ, రవికుమార్ గౌడ్, నక్క మల్లేష్, మేకల వెంకటేష్ తదితరులు ఉన్నారు.