హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బంట్వారంలో దంచికొడుతున్న వర్షం

VKB: బంట్వారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.