BDK: జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె తన్విత (5) ఆదివారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కారులోకి వెళ్లి చిక్కుకుపోయింది. కొంతసేపటి తర్వాత స్థానికులు చిన్నారిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
కారులో ఊపిరాడక చిన్నారి మృతి


