హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాగులతో ఆరోగ్య ప్రయోజనాలు

రాగులలో క్యాల్షియం, పీచు పదార్థం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. రక్తహీనతను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.