హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం తర్వాత సోంపు తింటున్నారా..?

భోజనం తర్వాత సోంపు తినడం మన దేశంలో ఎప్పటినుంచో ఉన్న ఆచారం. ఇది నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి అజీర్తిని నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరిగి, కడుపు తేలికగా అనిపిస్తుంది. అందుకే ప్రతిరోజూ భోజనం తర్వాత గుప్పెడు సోంపు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు.