హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్!

GNTR: ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ సాయికాంత్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో 25వ తేదీ నుంచి కలెక్టర్ సాయికాంత్ వర్మ జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.