హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొగ్గు తవ్వకాలపై పోరాట కమిటీ ఆగ్రహం..!

ELR: బొగ్గు పేరుతో తమ జీవితాలను బుగ్గిపాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పోరాట కమిటీ కన్వీనర్ చిక్కాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సాయంత్రం చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి సీపీఐ రాష్ట్ర నాయకుల బృందం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భూగర్భ వాయువు ద్వారా బొగ్గు తవ్వకాలు చేపడితే వాతావరణ కాలుష్యం పెరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.