SDPT: బెజ్జంకి మండలం నరసింహులపల్లి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దునే వెంకటేశ్వరరావు గత సంవత్సరంలో పశువులను కొనుగోలు చేశారు. ఆదివారం తన పశువుకు 2 తలల దూడ జన్మించడంతో వివిధ గ్రామాల నుంచి దూడను చూడడానికి ప్రజలు వస్తున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. జన్యుపరమైన లోపాలతో ఇలాంటివి సంభవిస్తాయని వైద్యాధికారులు తెలిపారు.
తెలంగాణ
రెండు తలలతో దూడ జననం..!


